![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -321 లో.. రాజ్, శ్వేత క్లోజ్ గా ఉండడం చుసిన కావ్య షాక్ అవుతుంది. ఇంటికి వస్తు కూడా అదే విషయం గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. కావ్య ఇంటికి రాగానే అనామిక ఎదరుగా వస్తుంది. నీకోసమే వెయిట్ చేస్తున్నాను.. నాకూ కాశ్మీర్ పులావ్ నేర్పించు అంటు కావ్యని అనామిక అడుగుతుంది. ఇప్పుడు ఇంట్రస్ట్ లేదు తర్వాత అని చెప్పిన కూడా కావ్యని విసిగిస్తుంది అనామిక.
ఆ తర్వాత నాకు ఓపిక లేదంటే అర్ధం కదా అని కావ్య అనగానే.. అదంతా చూస్తున్న ధాన్యలక్ష్మి వచ్చి.. ఏంటి నా కోడలిపై అరుస్తున్నావ్? తనేం అడిగింది కళ్యాణ్ కి ఇష్టమైన వంట నేర్పించమని అడిగింది అంతే కదా.. అదేదో మీ పుట్టింటి నుండి తెచ్చిన నగలు అడిగినట్లు అంత చిరాకు పడుతున్నావ్? ఒక్క రోజు ఆఫీస్ కీ వెళ్ళగానే అహంకారం వచ్చిందా అని ధాన్యలక్ష్మి అనగానే.. ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నారు. నా పుట్టింటి గురించి తీస్తారేంటి? మీకు వండి వర్చి పెట్టడానికే పుట్టానా అని కావ్య అంటుంది. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావని ధాన్యలక్ష్మి అంటుంది. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావని అపర్ణ వచ్చి అంటుంది. నా కోడలిపై అరిచే హక్కు నీకు ఎక్కడిది. తను ఆఫీస్ కి వెళ్లి అలసిపోయి వచ్చింది. నీ కోడలికి వంట నువ్వు నేర్పించుకో.. ఇక నుండి కావ్య ఆఫీస్ కి వెళ్తుంది.. నీ కోడలు వంట చెయ్యాలని అపర్ణ ఆర్డర్ వేస్తుంది. కావ్య నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకోమని కావ్యని పంపిస్తుంది అపర్ణ. ఆ తర్వాత బాధపడుతున్న కావ్య దగ్గరికి కళ్యాణ్ వచ్చి.. ఆఫీస్ లో ఏమైందని అడుగుతాడు.
రాజ్ ఆఫీస్ నుండి శ్వేత దగ్గరికి వెళ్లిన విషయం.. వాళ్ళిద్దరు క్లోజ్ గా ఉన్న విషయం కళ్యాణ్ తో కావ్య షేర్ చేసుకుంటుంది. అన్నయ్య ఇంతలా మారిపోయాడా అని కళ్యాణ్ అంటాడు. ఇక లేట్ చెయ్యకు.. అన్నయ్య వచ్చాక అన్ని అడుగమని కళ్యాణ్ సలహా ఇస్తాడు. కాసేపటికి రాజ్ ఇంటికి వస్తాడు. రాజ్ రాగానే.. ఎక్కడకి వెళ్ళావని కావ్య అడుగుతుంది. ఏంటి నా గురించి అడగాల్సిన అవసరం లేదని రాజ్ అనగానే.. నేను నీ భార్యని శ్వేతని కాదని కావ్య అంటుంది. అది విని రాజ్ షాక్ అవుతాడు. మీరు రహస్యంగా కలుస్తున్న శ్వేత ఎవరని కావ్య అడుగుతుంది.. కొన్ని రోజులు ఉండి వెళ్లేదానివి.. నీకు చెప్పాలిసిన అవసరం లేదు అయిన నిన్ను భార్యగా నేను అనుకోవట్లేదని రాజ్ అనగానే.. నన్ను భార్యగా అనుకోకపోవడానికి మీ దగ్గర కారణాలు ఉన్నాయా అని కావ్య అడుగుతుంది. తరువాయి భాగంలో నువ్వు నా భార్య కాదని అనడానికి చాలా కారణాలున్నాయంటూ ఒక బోర్డుపై రాజ్ రాస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |